
అనిల్ రావిపూడికి గంటా శ్రీనివాసరావు సాదర స్వాగతం
- గంటా ఇంటికి అనిల్ రావిపూడి
- సాదరంగా ఆహ్వానం..సత్కారం
మెగాస్టార్ చిరంజీవిని కొత్త కోణంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేయనున్నట్టు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఆదివారం ఉదయం విశాఖలో సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న అనంతరం మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి సినిమాల్లో పాటలకు విశేష ప్రాధాన్యముంటుందని, కొత్త సినిమాలోనూ అదే ట్రెండ్ ఉంటుందన్నారు. స్టార్ సింగర్, మ్యూజిక్ డైరక్టర్ రమణ గోగులతో పాట పాడించే ఆలోచన ఉందని చెప్పారు. మే లో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిని గంటా సత్కరించారు. తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విజయవంతమైన సందర్భంగా గంటా శ్రీనివాసరావుతో పాటు గంటా రవితేజ అభినందించారు.
