April 26, 2025
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఈ నెల 18 నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడాప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ నెల 18 నుంచి ప్రారంభం
పాత సాంప్రదాయానికి తిరిగి అంకురం చేస్తున్న సీఎం చంద్రబాబు
చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఈ నెల 18 నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడాప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ఈ సాంప్రదాయం ఉండేదని, గత ప్రభుత్వం శాసన సభ సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేధన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మళ్లీ పాత సాంప్రదాయదాయానికి స్వాగతం పలకటం గొప్ప నిర్ణయన్నారు. మానవుడి దైనందిన జీవితంలో స్ట్రెస్, బిజీలైఫ్ నుంచి క్రీడాపోటీలు ద్వారా సేదతీరవచ్చన్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియంలను అభివృద్ధి చేయనున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, టూరిజంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చీఫ్ విప్ జీవీ అన్నారు.


కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ క్రీడాపోటీలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. అందరూ వస్తారని ఆశిస్తున్నామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు దాదాపు 12 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి క్రికెట్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, బాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, వంద మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, టెబుల్ టెన్నిస్ తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 20వ తారీఖున హరిత బెర్మ్ పార్క్ నందు బడ్జెట్ డిన్నర్ తో పాటు క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో టూరిజం పూర్తిగా దెబ్బతిందని, అలాగే స్పోర్ట్స్ ను సైతం పక్కన పడేశారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆవేధన వ్యక్తం చేశారు. కాని కూటమి ప్రభుత్వం టూరిజం, స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మన రాష్ట్రం నుంచి ఒలంపిక్ బంగారు పతక సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. విద్యాశాఖ ద్వారా విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు పెంపొందేలా విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.
ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ దశాబ్ధం క్రితం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు నిర్వహించే సాంప్రదాయం ఉండేదని, మళ్లీ సీఎం చంద్రబాబు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం హర్షనీయమన్నారు. విపక్ష సభ్యులు కేవలం హోదా కావాలి, మైక్ కావాలంటున్నారు కాని సభకు వస్తే తప్పకుండ వారికి మాట్లాడే అవకాశం ఇస్తామని, వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
సమావేశంలో ఏపీఎల్ఏ సెక్రటరీ ప్రసన్న కుమార్, టీడీఎల్పీ ఇన్ ఛార్జీ కోనేరు సురేష్, శాఫ్ ఏవో రమావత్ వెంకట రమణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న చీప్ విప్ ఆంజనేయులు, అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *