ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్ నామ ఉగాది వేడుకలు.
తిరుమల దేవాలయం నమూనాలో ఉగాదివేడుకలు వేదిక.
పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ.
ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి భారతి దంపతులు.
సాంప్రదాయ పంచకట్టులో ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి.
ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి దంపతులకు ఆహ్వానం పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై శ్రీలక్ష్మి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఇతర అధికారులు.
ఉగాది వేడుకల ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో పూజలు నిర్వహించిన సీఎం శ్రీ వైయస్.జగన్ దంపతులు.
ఉగాది వేడుకలకు హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదాలను అందించిన తిరుమల తిరుపతి దేవస్ధానం, శ్రీ దుర్గామల్లీశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు.
ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం.
ఉగాది వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో పంచాంగ శ్రవణం.
పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
పంచాంగాన్ని చదివి వినిపించిన పంచాంగకర్త శ్రీ కప్పగంటి సుబ్బరాయ సోమయాజులు.
పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దంపతులు.
అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి భారతి దంపతులు.
వ్యవసాయ పంచాంగం 2023–24ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.
సాంస్కృతికశాఖ రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం, హాజరైన సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా.
ఉగాది వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన సీఎం శ్రీ వైయస్.జగన్ దంపతులు.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వేద పండితులును, కళాకారులను సత్కరించిన సీఎం.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే…:
ఇక్కడకి ఉగాది వేడుకలకు హాజరైన వారితో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడుకి, స్నేహితుడికీ, ప్రతి అవ్వాతాతలకూ ఈ ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ, సాంస్క్రృతిక పర్యాటకశాఖమంత్రి ఆర్ కె రోజా, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.