ధాత్రి న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఒంగోలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి కొద్దిసేపు చర్చించుకున్నారు. అధికారపార్టీలో కీలకనేతలుగా ఉన్న వై.వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో సన్నిహితంగా మెలిగే కోలా ప్రభాకర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.