అరసవల్లి సూర్య నారాయణస్వామిని దర్శించుకున్న అమరావతి మహిళా రైతులు

అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు.

అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రథాన్ని శ్రీకాకుళం తీసుకొచ్చిన రైతులు శనివారం ఆదిత్యుని ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *