- మంత్రి ఆదిమూలపు సురేష్ పై వంగలపూడి అనిత ధ్వజం
- జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు
- ఉన్నత విద్యావంతుడు చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిదే
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలిపశువుల్ని చేస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ద్వజమెత్తారు. ఆదివారం నాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ…. జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. కోడికత్తి డ్రామాకు శీను అనే దళిత యువకుడిని వాడుకుని జగన్ రెడ్డి సీఎం పీఠం ఎక్కారు. అతను నాలుగేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నా ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవటం లేదు? ఉన్నత విద్యావంతుడు, దళిత మంత్రిని చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలిబెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. జగన్ రెడ్డి…లోకేశ్ అనని మాటలు అన్నట్టు చిత్రీకరించి మంత్రి సురేష్ ని పావుగా వాడుకుని నిరసన పేరుతో చంద్రబాబు నాయుడిపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు. యర్రగొండపాలెం కంటే ముందు మార్కాపురంలో చంద్రబాబు పర్యటన జరిగింది. అక్కడ ఎమ్మెల్యే చేత జగన్ రెడ్డి చొక్కా ఎందుకు విప్పించలేదు? అతను తన సామాజికవర్గానికి చెందిన వాడనా? మంత్రి ఆదిమూలపు సురేష్ అర్దనగ్న సురేష్ గా మారిపోయారు. వివేకా హత్య కేసుపై సురేష్ చేసిన వ్యాఖ్యలకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ మంట చల్లార్చేందుకు జగన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేందుకు సురేష్ తాడేపల్లి పెద్దలతో కలిసి చంద్రబాబు నాయుడిపై దాడికి కుట్ర పన్నారు. లోకేశ్ అనని మాటలను అన్నట్లుగా చిత్రకరించి దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ నిరసన చేయటం దుర్మార్గం. నిజంగా మంత్రి సురేష్ కి దళితులపై అంత ప్రేమ ఉంటే వైసీపీ పాలనలో నాలుగేళ్ల నుంచి దళితులపై దాడులు, దౌర్జన్యాలు హత్యలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు చొక్కా విప్పి నిరసన తెలపలేదు? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రమణ్యంను చంపి డోర్ డెలవరి చేస్తే సురేష్ రక్తం ఎందుకు మరగలేదు? నెల్లూరులో నారాయణ, కావలి కరుణాకర్, విశాఖలో డా . సుధాకర్ ను చంపేసిపుడు సురేష్ ఎందుకు చొక్కా విప్పి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలపలేదు? పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం జరిగిపుడు , పేరేచర్లలో దళిత మైనర్ బాలికను 3 నెలల పాటు వైసీపీ నేతలు సామూహిక అత్యచారం చేసినపుడు సురేష్ ఎక్కడున్నారు? ఆయన ఎందుకు బయటకొచ్చి మాట్లాడలేదు? రాజమండ్రిలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి స్పందించినా దళిత మంత్రులు ఎందుకు స్పందించలేదు? అప్పుడు సురేష్ దళిత రక్తం మరగలేదా? దళితులపై అక్రమ కేసులు ఎందుకు మాట్లాడలేదు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు, 27 పధకాలు రద్దు చేశారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ రెడ్డి పేరుకున్నారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు. వీటిపై ఎందుకు నోరు మెదపలేదో సురేష్ సమాధానం చెప్పాలి. దళితులపై ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డ వైసీపీ నేతలకు అసలు ఇంట్లో నుంచి బయటకొచ్చే హక్కు ఉందా?
ఐపీఎస్ చదివిన పోలీసులు వైసీపీ నాయకుల ప్రాపకం కోసం పాకులాడటం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడిపై దాడి చేసి తిరిగి చంద్రబాబు నాయుడుపై, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడతారా? చంద్రబాబు నాయుడి సెక్కూరిటీకి రాయి తగిలి గాయపడితే దానిపై కేసు ఎందుకు పెట్టలేదు? అనుమతి లేకుండా నడిరోడ్డుపై నిరసన పేరుతో వీరంగం సృష్టించిన మంత్రి సురేష్ పై ఏం కేసు పెట్టారు? పోలీసులు అధికారులే చంద్రబాబు నాయుడు ఏ రోడ్డులో వస్తారో మంత్రి చెప్పి దాడికి సహకరించటం దుర్మార్గం. అమరావతిలో చంద్రబాబు నాయుడి బస్సుపై రాయి విసిరినపుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ దాడి జరిగేదా? చంద్రబాబు నాయుడిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలని వంగలపూడి అనిత అన్నారు.