- జీవనాడి గొంతు నులిమేశారు…
- రివర్స్ టెండరింగ్ తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడు
- డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణం
- రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయి
- పోలవరం విధ్వంసం పై మా ప్రశ్నలకు ఎదురుదాడి కాదు…సమాధానం చెప్పాలి
- టీడీపీ హయాంలో రూ.11, 537 కోట్లు ఖర్చు చేస్తే…వైసీపీ రూ.4611 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది
- నాడు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్..నేడు ముంపు బాధితలను ముంచేశాడు
- నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం
- పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబునాయుడు
- అమరావతి, ధాత్రి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, రివర్స్ పోకడల కారణంగా జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం అయ్యిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే శని అని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండర్లు అంటూ ప్రాజెక్టును, రాష్ట్రాన్ని రివర్స్ చేశారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణమని…రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయని ఆధారాలతో సహా వివరించారు. పోలవరం విధ్వంసం పై మా ప్రశ్నలకు ఎదురుదాడి చేయడం కాదు..సమాధానం చెప్పాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11, 537 కోట్లు ఖర్చు చేస్తే…వైసీపీ రూ.4611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంప బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్..నేడు ముంపు బాధితలను ముంచేశాడని మండి పడ్డారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం వేద్దాం అని తాను భావిస్తే…ఆ కలను జగన్ నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో నాటినుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను, ప్రోగ్రస్ ను వివరిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టారు. 2020 కే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతుంది…సాంకేతికంగా జరిగిన తప్పులకు కారకులు ఎవరు…..ప్రాజెక్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వివరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మీడియా సమావేశం లో చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశాలు- ….“ రాష్ట్రప్రజల తరతరాల ఆకాంక్ష పోలవరం. బ్రిటీష్ పాలకులు 1941లో పోలవరం నిర్మాణంపై ఆలోచనచేశారు. ఎక్కువఖర్చు అవుతుందని కొన్ని కారణాలతో విరమించుకున్నారు. దేశంలోని పుణ్యనదుల్లో పవిత్ర గోదావరి ముఖ్యమైనది. గంగా, కావేరి అనుసంధానంతో దేశానికే మంచి జరుగుతుందని వాజ్ పేయ్ ప్రభుత్వానికి చెప్పాను. దానిపై ఎన్.డీ.ఏ ప్రభుత్వం సురేశ్ ప్రభు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. ఏ పనైనా శ్రద్ధ పెట్టిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉం టాయి. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలన్న ప్రగాఢ ఆకాంక్షతో పోలవరం నిర్మాణానికి సిద్ధపడ్డాను. అలాంటి ప్రాజెక్టును దుర్మార్గులు అహంకారంతో చేజేతులా నాశనం చేశారు. దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని స్వార్థప్రయోజనాలకు తాకట్టుపెట్టే దుస్థితికి వచ్చారు. అందుకే అంటున్నాం..పోలవరానికి జగనే శని అని.
పోలవరం ప్రాజెక్ట్ స్వరూప స్వభావం:-
గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 2 వేల నుంచి 4వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఆ నీటిని సమర్థంగా వాడుకుంటే రాష్ట్రరూపురేఖలే మారిపోతాయి.
194 టీఎంసీల నీటిసామర్థ్యంతో పోలవరం నిర్మాణం మొదలెట్టాం. మరో 200టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశముంది. 7.2లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుంది. 28.50 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి. పరిశ్రమ లకు సమృద్ధిగా నీరు అందడంతోపాటు, వాటర్ టూరిజం అభివృద్ధికి అపారఅవకాశా లు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు నీళ్లు అందించవచ్చు.
960 మెగావాట్ల హైడల్ పవర్ అందుబాటులోకి వస్తే, రాష్ట్రానికి విద్యుత్ సమస్యే ఉండ దు. విద్యుత్ ధరలు బాగా తగ్గుతాయి. పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అదనంగా హైడల్ విద్యుత్ జతచేస్తే, మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం లైఫ్ లైన్… పెద్ద ఆస్తి… 5 కోట్ల ప్రజల కల. కల సాకారమయ్యే వేళ దుర్మార్గుల చేతిలో బలైపోయింది.
50లక్షల క్యూసెక్కుల వదర వచ్చే ఏకైక నది. 100 మీటర్ల లోతైన డయాఫ్రమ్ వాల్, దేశంలో ఏ ప్రాజెక్ట్ కు ఇంతలోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మించలేదు. 20 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పున్న అతిపెద్ద గేట్లు, 354 కిలోమీటర్ల పొడవున్న కుడి, ఎడమకాలువలు. నిర్మాణపరంగా దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. 24 గంటల్లోనే 32,315 క్యూబిక్ మీ టర్ల కాంక్రీట్ వర్క్ తో గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు, బ్రహ్మండమైన అటవీప్రాంతంతో పర్యాటకాభివృద్ధికి గొప్ప అవకాశాలు. -
టీడీపీహాయాంలో పోలవరం పురోగతి:-
నేను ముఖ్యమంత్రి అవుతూనే ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆలోచించాను. ఎన్.డీ.ఏ ప్రభుత్వా న్ని కలిసి, ప్రాజెక్ట్ నిర్మాణానికి అత్యంత కీలకమైన 7 ముంపు మండలాలను తెలంగా ణ నుంచి ఏపీలో కలపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాను. ఆ 7 మండలాలు రాకపోతే ప్రా జెక్ట్ పూర్తికాదు.. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయలేను అని భావించాను. అందుకే ముంపు మండలాలను విలీనం చేస్తే తప్ప ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పాను.7 మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేశారు. తెలుగుదేశంపార్టీ చిత్తశుద్ధికి, ఎన్.డీ.ఏ సహకారానికి ఇదే నిద ర్శనం.
పాలనా పగ్గాలు చేపట్టాక అనేక సమస్యలున్నాయి…కానీ వాటిని అధిగమించి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 72శాతం పూర్తిచేశాము. రూ.11,537కోట్లు ఖర్చుపెట్టాము. డీ.పీ.ఆర్.-2 రూ.55,548కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం పొందేలా చేశాము. నెలకు రెండుసార్లు ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించాను.
వై.ఎస్.నిర్వాకంతో ప్రాజెక్ట్ 10ఏళ్లు ఆలస్యం:-
2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ నిర్మాణపనుల్ని మధుకాన్, శీనయ్య అండ్ కంపెనీకి కట్టబెట్టారు. 2009లో రెండుసంస్థల్ని రద్దుచేశారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులు నిర్లక్ష్యం చేశారు. కేవలం కాలువల తవ్వకంపై దృష్టిపెట్టారు. రైతు లకు, నిర్వాసితులకు రూపాయి పరిహారం ఇవ్వలేదు. పొరుగురాష్ట్రాలతో ఉన్న వివా దాల్ని పరిష్కరించలేదు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులే జరిగా యి. రూ.423 కోట్లు ఖర్చుపెట్టారు. 13-08-2009న ప్రాజెక్ట్ పనులు చేస్తున్న సంస్థ ల్ని రద్దుచేశారు. 2004లో ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ అవార్డైతే, 2009వరకు వాటిలో ఎలాంటి పురోగతలేదు. మొత్తం ప్రాజెక్టుని సమస్యల సుడిలోకి నెట్టేశారు.
జగన్ అడుగుపెట్టాడు.. పోలవరానికి దుర్గతి పట్టింది:-
ఈ ముఖ్యమంత్రి వచ్చీరాగానే రివర్స్ టెండరింగ్ అన్నాడు. ప్రాజెక్ట్ వ్యయం తగ్గిస్తానని, ఇన్ని వందలకోట్లు తగ్గాయని ప్రగల్భాలు పలికాడు. అలాచేయవద్దని చెప్పినా వినలే దు. పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి.. పనులు రద్దు చేస్తే అనేక సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పినా ఖాతరు చేయకుండా మూర్ఖుడు మూర్ఖత్వంతో ముందుకెళ్లాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులుచేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, మార్చవద్దని 13 ఆగస్ట్ 2019న (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) పీపీఏ చెప్పింది. 2009లో వై.ఎస్ కాంట్రాక్ట్ సంస్థను మార్చడం వల్ల పనులు నిలిచిపోయాయని చెప్పింది. కొత్తకాంట్రాక్ట్ సంస్థ రావడంవల్ల పనుల్లో ఆలస్యం జరుగుతుం దని, పాత సంస్థ చేసిన పనులకు కొత్తసంస్థ బాధ్యత వహించదని చెప్పింది..అయినా ఈ మూర్ఖుడు వినలేదు. ఈ ప్రభుత్వ నిర్ణయాలపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే.జైన్ 16-08-2019న లేఖ రాశాడు. దానిలో చాలాస్పష్టంగా రీ టెండరింగ్ నిర్ణయం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నాడు. ఎవరు చెప్పినా వినకుండా ముందుకెళ్లాడు. చివరకు ఒక దుర్మార్గుడి మూర్ఖత్వానికి పోలవ రం బలైంది. రివర్స్ పాలనతే రాష్ట్రాన్నే రివర్స్ లోకి నెట్టాడు.
ప్రాజెక్ట్ లో కీలకమైన కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ల ప్రాముఖ్యత…
గోదావరి ప్రవాహాన్ని పూర్తిగా దారిమళ్లించి, ప్రధాన డ్యామ్ నిర్మించాలి. నీరు లీకవకుం డా పునాదిని పటిష్టంచేసేలా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాం. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు పునాదిగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాం. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిం చడానికి కాఫర్ డ్యామ్ నిర్మించాం. డ్యాం డిజైన్ రివ్యూకమిటీ, పీపీఏ అనుమతితో ప నులు చేశాం. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తిచేశాం… 2 కిలోమీటర్ల పొడవున డయాఫ్ర మ్ వాల్ నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణప్రక్రియను పీపీఏ కూడా సర్టిఫై చేసి, బా గుందని కితాబిచ్చింది. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి అయింది. మిగిలింది ఈ.సీ.ఆర్.ఎఫ్ డ్యామే. అది కొనసాగించి ఉంటే, 2020 జూన్ కే నీళ్లు పారేవి.
మా హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వీళ్లు వచ్చాక కేవలం 4శాతం చేశారు. J కేవలం రూ.4,6111కోట్లు ఖర్చుచేశారు. టీడీపీహాయాంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి పీపీఏ, కేంద్ర మంత్రుల ప్రశంశలు.. అవార్డులు..గిన్నిస్ రికార్డులు లభిస్తే, ఇప్పుడు కేంద్రంతో చీవాట్లు తింటున్నారు. నాడు మేం పోలవరాన్ని ప్రజలకు చూపించాం.. బస్సుల్లో తరలించి, వారికి దానిప్రాముఖ్యతను తెలియచేశాం. వీళ్లు వచ్చాక దాన్ని నిషేధితప్రాం తంగా మార్చారు. వరదలు వస్తే నిర్వాసితుల్ని గాలికి వదిలేశారు. రెండు టమాటాలు. బంగాళాదుంపలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. భూములిచ్చినవారిని ఆదుకోలేని ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా? 2010-11 ధరల అంచనా ఆధారంగా మేం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలనిచూస్తే, మేం అధికారంలోకి వస్తే రెట్టింపు పరి హారం ఇస్తామని నిర్వాసితుల్ని వంచించారు. మేం చేసిన పనుల్లో అవినీతి జరిగిందని దుష్ప్రచారంచేశారు. తనబంధువుతో కమిటీ వేయించి, చివరకు ఏమీతేల్చలేక చేతు లు ముడుచుక్కూర్చున్నాడు.
- నాలుగేళ్లలో నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదు.
కేంద్రప్రభుత్వం అడిగిన ప్రశ్నకు జగన్ ప్రభుత్వమే పోలవరం నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని తమ శాఖ నుంచి సమాచారం పంపింది. పార్లమెంట్ అడిగిన ప్రశ్నకు 13-11-2019న ఏమని సమాధానమిచ్చారో ఈప్రభుత్వానికి తెలియదా? దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? సబ్జెక్ట్ తెలియదు.. నేర్చుకోడు.. అధికారులు చెప్పినా వినడు. అదీ ఇతని పనితనం. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన తప్పిదాలు, లోపాలపై హైదరాబాద్ ఐ.ఐ.టీ నివేదిక రూపంలో వాస్తవాలు బయటపెట్టింది. 2020లో వచ్చిన వరదకు ప్రాజెక్ట్ నిర్మా ణం దెబ్బతిన్నదని తేల్చింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి, వరదనీటిని సక్రమంగా దారిమళ్లించలేదని, దానివల్ల వరదలకు మొత్తం కొట్టుకుపోయిందని చెప్పింది. దీనిపై సమాధానంచెప్పకుండా సిగ్గులేకుండా ఎదురు దాడిచేస్తున్నారు. మేం పడిన కష్టాన్ని బూడిదలో పోశారు. మా హాయాంలో పనులు చేసిన సంస్థల్ని వద్దన్నారు..రెండేళ్ల తర్వాత వాళ్లే ముద్దన్నారు. డయాఫ్రమ్ వాల్ లో కీలకమైన కాఫర్ డ్యామ్ (డౌన్ స్ట్రీమ్), కాఫర్ డ్యామ్ (అప్ స్ట్రీమ్) ఈ మధ్యలో మొత్తం కొట్టుకుపోయి, ఇసుక పేరుకుం ది. స్పిల్ వే ఎడమవైపు నీటి ఉధృతిని ఎదుర్కోవ డానికి నిర్మించిన గైడ్ బండ్ కూడా కుంగి పోయింది. చివరకు ప్రాజెక్ట్ లో మిగిలింది గేట్లు. ఇంతదారుణం జరిగితే, సమాధానం చెప్పకుండా ఆంబోతు రంకెలేస్తారు. అధికారం ఇచ్చారని రాష్ట్రాన్నే గోదావరిలో ముం చేశారు. నిర్వాసితుల్ని నిండా ముంచేశాడు. పోలవరం నిర్వాసితులకు తనతండ్రి ఎకరాకు రూ.2లక్షలిస్తే దాన్ని తప్పుపట్టాడు. రెండేళ్లలో తమప్రభుత్వం వస్తే ఎకరాకు రూ.19లక్షలు ఇస్తుందని ప్రగల్భాలు పలికాడు. సకలవసతులతో నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తానన్నాడు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లుకట్టలేదు. టీడీపీప్రభుత్వంలో కేంద్రమిచ్చిన నిధులుచాలక, రాష్ట్రనిధులు కలిపి అత్యాధునిక వసతులతో నిర్వాసి తులకు కాలనీలు నిర్మించాం. టీడీపీ ప్రభుత్వం రూ.4,114కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రబుద్ధుడు రూ.1890 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ సొమ్ముకూడా తనపార్టీ వారిజేబుల్లోకే వెళ్లింది కానీ నిర్వాసితులకు రూపాయి అందలేదు. నిర్వాసితుల పొట్టకొట్టిన దుర్మార్గుడు ఈ ముఖ్య మంత్రి.
పోలవరం నిర్మాణంపై పలుసందర్భాల్లో జగన్ వ్యాఖ్యలు…
“ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాము. వర్షాలు తగ్గినవెంటనే పనులు జరుగుతాయి. ప్రాజెక్ట్ ను 2021 జూన్ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తాం..ప్రాజెక్ట్ బాగా స్పీడ్ తో పనిచేస్తోంది. ”
“ పోలవరం ప్రాజెక్ట్ ను ఖరీఫ్ 2022 నాటికి పూర్తిచేస్తాం. అప్పటికి కచ్చితంగా నీళ్లిస్తాం.”
“అవరోధాలు అన్నీ అధిగమించి, 2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తాం.”
“ క్రెడిబులిటీ అనేది మనంచేసే పనుల్ని బట్టి ఉంటుంది.”
ఇవీ వీళ్ల మాటలు. వీళ్లతో మనం మాటలు పడాలి.. వీళ్లు చేష్టలు, చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడాలి. ఏమిటి రాష్ట్రానికి పట్టిన ఈ ఖర్మ? అర్థంచేసుకుంటే ప్రజలు ఈ నాయకుల్ని భూస్థాపితం చేయాలి. శాశ్వతంగా వీరిని రాజకీయసమాధి చేయాలి. ఏం చెప్పామో, ఎప్పుడు చెప్పామో ఆలోచించరు. నోరుందని ఏదిపడితే అది అనడమే. నిన్నకూడా ఏదో మాట్లాడాడు? టీఎంసీలకు, క్యూసెక్కలకు తేడా తెలియదు. వీళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టను. చేతగాని దద్దమ్మ రాజకీయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. నిన్నకూడా పెద్దిరెడ్డి ఏవేవో కథలు చెబుతున్నాడు. మీకంటే బాగా మేం మాట్లాడగలం..కానీ సభ్యత, సంస్కారం, విశ్వసనీయతకు కట్టుబడేవాళ్లం కాబట్టి, ప్రజ లకోసం సంయమనం పాటిస్తున్నాం. - 69 నదులనే పుష్పాలను మాలగా మార్చే దారమే పోలవరం నిర్మాణం.. ఆ పుష్పహా రాన్ని తెలుగుతల్లికి మణిహారంగా సమర్పించాలనుకున్నాను.
40 ఏళ్లపాటు ప్రజలు నన్ను ఆదరించారు. నా తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేశాను. దాని నమూనానే హైదరాబాద్ అభివృ ద్ధి. ఐటీ పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలిచాను. దాంతోమనవాళ్లు ప్రపంచాన్ని జయిం చే స్థాయిలో ఉన్నారు. మరలా నా మనసుకి దగ్గరైన కార్యక్రమం పోలవరం నిర్మా ణం..నదుల అనుసంధానం. 69 నదులు పుష్పాలైతే, వాటిని మాలగా మార్చే దారమే పోలవరం. దాని నిర్మాణంతో పోలవరమనే పుష్పహారాన్ని తెలుగుతల్లికి సమర్పించి నా రుణం తీర్చుకోవాలనుకున్నాను. అదే జరిగితే నా జీవితానికి సార్థకత చేకూరినట్టే అని భావించాను. పోలవరాన్ని ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేయడానికి నిరంతరం శ్రమించా ను. గడ్కరీ గారిని కలవడానికి పండుగరోజున నాగ్ పూర్ లోని ఆయనింటికి వెళ్లాను. గడ్కరీ, అరుణ్ జైట్లీ ఒకసారి డబ్బులిస్తాంగానీ… భూ సేకరణ మీరే చేసుకోవాలన్నారు. ఏం చేయాలో అర్థంకాక అధికారులు, న్యాయవాదులతో మాట్లాడాను. చట్టంలో ఏం చెప్పారో.. ఇప్పుడేమంటున్నారో ఆలోచించమని గడ్కరీ, అరుణ్ జైట్లీలతో మాట్లాడా ను. చివరకు వారు ఒప్పుకున్నారు. ఇవిచేసింది నా సొంతానికి, స్వార్థానికి కాదే, కేసు లకోసం చేయలేదే. ఇవన్నీ తలుచుకుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. తట్టుకోలేని ఆవేదన, ఆవేశం వస్తాయి. మరలా ఈ ప్రాజెక్టులన్నీ దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరి మితితో పనిచేస్తాను. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టలువద్దకు వెళ్లి, వీళ్ల వ్యవహారాన్ని బాగో తాన్ని బట్టబయలు చేస్తాను. ప్రజలకు సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టను. ఇప్పటి వరకు ప్రజలకు వీళ్లు చూపించారు.. ఇకనుంచి ప్రజలు వీళ్లకు చూపిస్తారు. నాలుగేళ్ల లో తిట్టడం తప్ప, ఈ మంచి పని చేశానని చెప్పగలడా? ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉండి ఊరికే రంకెలేస్తోనో, బూతులు తిడితేనో, వ్యక్తిత్వహననానికి పాల్పడితేనో సమ స్యలు పరిష్కారం కావు అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి తాను పడిన కష్టం, నేడు ప్రాజెక్టు దుస్థితి గురించి వివరిస్తూ చంద్రబాబు నాయుడు కొంత ఎమోషనల్ అయ్యారు. తన బాధ, ఆవేదన ప్రజల కోసమే అని…వారిని చైతన్య పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం నుంచి పర్యటిస్తానని చెప్పారు. ప్రతి ప్రాజెక్టు వద్దకువెళ్లి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు.